హలో
హలో
చల్లటి గాలిలా వీస్తున్నవాడు
కొండవాగులా ప్రవహిస్తున్నవాడు
తట్టి తట్టి నిద్రలేపుతున్నవాడు
నిత్య జాగరూకుడు
ప్రేమతో పలకరిస్తున్నవాడు
అమ్రుతగానం వినిపిస్తున్నవాడు
ఆకాశాలను వెలిగిస్తున్నవాడు
భూమినంతా శుభ్రపరుస్తున్నవాడు
మాత్రుమూర్తిని మాత్రుదేశాన్ని గౌరవించేవాడు
పిల్లల్ని కళ్ళు చేసుకొని కొత్తలోకాల్ని
చూస్తున్నవాడు
స్నేహితులకు ఇస్టుడు
అత్తరు వాసన లాంటివాడు
ఆత్మీయతకు నిర్వచనం వాడు
వణికించే భయాలను చూపుడు వేలితో
బెదిరించేవాడు
వాడెక్కడున్నాడు
చెప్పవా హలో హలో...
... సిరి ✍️❤️
