హాహాకారాలు
హాహాకారాలు


ప౹౹
ఆమనే అంది వచ్చెనే ఈ ఋతువులో
ఆమెనే కదిలి వచ్చెనే ప్రేమ క్రతువులో ౹2౹
చ౹౹
ఎన్ని వసంతాలుగ ఎదురు చూపులు
ఎదలోని పంతాలకూ మునిమాపులు ౹2౹
విరిసి కాసినే వివరమై వలపూ పూలు
మురిసి చూసినే మురిపమై తూపులు ౹ప౹
చ౹౹ .
పూల భారంతో వంగిన లేత కొమ్మలూ
కాల ప్రభావంతో కలిగే కొత్త ఊహలూ ౹2౹
మనసులో ఏదో మత్తునే పెంచె మరలి
సొగసులో సొంపు పకృతే పంచే తరలి ౹ప౹
చ౹౹
కలసివచ్చెనే కాంతలకు వనవిహారాలే
కదిలినే కాముకులా ఎలమి ప్రహారాలే ౹2౹
ఏతీగ తాకినా వినిపించే ప్రేమస్వరాలే
తూనీగ నడుమూ దాని హాహాకారాలే ౹ప౹