గురుతులు
గురుతులు


ప౹౹
చిన్ననాటి గురుతులు మదిలో చిగురింతలే
మొన్నే జరిగినట్లు ఎదలో అంత గిలిగింతలే ౹2౹
చ౹౹
ఎన్నని ఎంచనే బాల్య మధుర జ్ఞాపకాలుగా
కొన్నైన మిగులూ చెప్పుకొనే వ్యాపకాలుగా ౹2౹
మధుర క్షణాలు మళ్ళీ వచ్చి పలకరించేనా
ఎదురే చూసిన మనసే మరి పులకరించేనా ౹ప౹
చ౹౹
అది పచ్చని అడవితో కూడిన ఓ పేద్ద కొండ
పది ప్రాయంలో ఎక్కి లేకుండా ఎవరి అండ ౹2౹
చూపించిన తెగువ ఆ ఆనందపు సృతులూ
ఊహించని ఉల్లాసం కావా మధుర క్షణాలూ ౹ప౹
చ౹౹
చెప్పుకుంటే చేంతాడు భారతమే ఆ కధలు
చెప్పుకోకున్నా సతతం మనసులో మెదలు ౹2౹
బాధల్లేని బాల్యంలో భావాలు ఎంచ అనేకం
వాదాల్లేని బాల్యమంతా ఓ మధుర జ్ఞాపకం ౹ప౹