గురుదేహ
గురుదేహ
అక్షరాల నిత్యనూత్న..మల్లికలను వర్షింతువు..!
భావవీణ రాగాలకు..గమకసుధను వడ్డింతువు..!
గురుదేవా..మాటాడవు..కన్నులెత్తి నను చూడవు..
ఒకపరవశ నదిలాగా..నా పాటను పొంగింతువు..!
నా లోపలి 'నేను'లతో..సమావేశ మెట్లవుదువొ..
బంధాలకు సాక్షికాగ..నిజఎఱుకను వెలిగింతువు..!
వ్యామోహపు కోవెలైన..ఈ తనువును ఏమననిక..
కన్నులింట చేరగాను..నా ధ్యాసను పండింతువు..!
నీ ప్రేమకు ఎల్లలేవొ..కనిపెట్టగ నేనెంతట..
చమత్కార వైభోగపు..వీధుల నను నడిపింతువు..!
నాపాలిటి సంపదంటె..నీ చూపని ఏంచెప్పను..
కావ్యగరిమ నింపుకోగ..వాక్యాలను పలికింతువు..!
