గుప్పెడు నిజాయితీ కోసం
గుప్పెడు నిజాయితీ కోసం
గుప్పెడు నిజాయితీ కోసం
దోసిలి జోడించి వేడుకునే ఓ మనిషి
నీ గుండె లోతుల్లో కన్నీళ్లు మంచులా కరిగి నీరై పోతుంది జారనీయక ఒడిసిపట్టుకో
అవినీతి ఉప్పెనై ,ఎగసే జ్వాలలా జడలు విరుచుకుపడుతుంది.
కరిగిన నీ కన్నీళ్లు ఎగసే జ్వాలను
ఆర్పే ఆయుధం కావాలి.
లే... పూరించు పాంచజన్యం
మరో కృష్ణుడిలా ..
అవినీతి వేళ్ళు పాతుకుపోతున్నాయి నిరంతరహోరులా
నిశ్శబ్దం మస్తిష్కం నుండి తొలగించు నిరంతర నినాద జోరులో
చీల్చి చెండాడే భావజాలం అలవర్చుకో .
మరో నాయకుడి లక్షణాలు పునికి పుచ్చుకో
పెద్ద ప్రజాస్వామ్య దేశం మన దేశం
ఇప్పుడు అవినీతి కలగూరగంపలా కలగలిసిన దేశమైంది..
ప్రభుత్వాలకు నీ విలువ తెలియదు,
నీకు తెలుసుగా రాజ్యాంగం విలువ.
లే మేలుకో గుప్పెడు నిజాయితీ కోసం
స్మశానంలో నిద్రపోమాక,
చేసిన పాపం, పుణ్యం చేరే చోటది.
మత్తులో ఊగిపొక
నీలో ఉన్న ఆలోచనల ఫిరంగులన్నీ
గురి చూసి ఎక్కుపెట్టు ధనస్సులా ,
బరిచూసి దెబ్బ కొట్టు తపస్సులా .
నీ పిడికిలి కొడవళ్లతో పెకిలిస్తావో
రగిలే నీమనసుని కాల్చేస్తావో
నిర్ణయం నీదే.
అవినీతి రహిత సమాజ కోసం
రేపటి తరం స్వేచ్ఛకి పునాది కోసం
గుప్పెడు నిజాయితీ కోసం
దోసిలి జోడించి వేడుకునే ఓ మనిషి
అవినీతి నీ తప్పస్సులా నిర్మూలించు
నీతి నిజాయితీలో ఉషస్సులా ఉదయించు
