గుప్పెడంత గుండె
గుప్పెడంత గుండె
ఎందుకింత ఆనందమో చెప్పవేమి మనసా
కలవలేని తీరాలకు కాస్తయినా తెలుసా
అమృతాన్ని అద్దుకున్న ఆనందపు క్షణమిది
మనసంతా అల్లుకున్న పరిమళమై మురిసా
వానచినుకు కురిసినపుడు పరవసించె ఎడారి
ఇసుకకింత సంబరమని సూరీనికి అలుసా
కాలానికి గాలమేసి అడగాలని ఉన్నది
మనసుభాష అర్ధాలను వెతకడమే మరిచా
కరిగి మరిగి పోయెనులే ఏకాంతపు గురుతులు
గుప్పెడంత గుండెకిపుడు చెప్పనంత సొగసా

