గుండెలయలు
గుండెలయలు
గుండెలయల రాగాలను..చిలికేనా తాను..!
పలుకలేని భావాలను..కురిసేనా తాను..!
ఎంతముద్దు గుమ్మంటే..వర్ణించగ లేను..
కనిపించక ఎదలోయల..నిండేనా తాను..!
ఏ పూవులు పరిమళించు..తనచూపుల లాగ..
మెఱుపుమల్లె తీగలాగ..చుట్టేనా తాను..!
నవమృదంగ నాదాలకు..ప్రాణం తన నవ్వు..
చూపలేని సెలయేఱై..దూకేనా తాను..!
పాలునీరు వేరుచేయు..విద్య నేర్పు జాణ..
మౌనగగన హంసనిధిని..ఏలేనా తాను..!
చిరుగాలుల సఖులకూడి..చందనాలు పంచు..
అనురాగపు పరాగాలు..పంచేనా తాను..!

