STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

గుండెలో గుబులు

గుండెలో గుబులు

1 min
378

గుండెలో గుబులునే మోసాను ఎందుకో?

మనసునే మౌనముగ మలిచాను ఎందుకో?


ఆశలే శ్వాసగా గడపాలి అనుకున్న

నిరాశా నిట్టూర్పు లిడిచాను ఎందుకో?


పూవులా పూసాయి నాలోన భావాలు 

పరిమళము బంధించి ఉంచాను ఎందుకో?


మార్గాలు ఉంటాయి వెదికితే ఎన్నైన

శూన్యమే కనిపించి కుమిలాను ఎందుకో?


ప్రసన్నము చేసేటి వరమునే కోరాను

దిగులేదొ కమ్మేసి ఏడ్చాను ఎందుకో?



Rate this content
Log in

Similar telugu poem from Romance