గుండె పాట
గుండె పాట


కులాలెన్ని ఉన్ననేమి
కూడి ఉన్నఒక్కటిరా
మతా లెన్ని ఉన్ననేమి
మనుషులంత ఒక్కటిరా!
చుక్కలెన్ని ఉన్ననేమి
చూడ నింగి ఒక్కటిరా
రాష్ట్రము లెన్నెన్ని ఉన్ననేమి
రాజధాని ఒక్కటిరా!
కిరణము లెన్నెన్ని ఉన్న
దివ్య దీప మొక్కటిరా
ఆన్నదమ్ము లెందరున్న
కన్నతల్లి ఒక్కటిరా
ఎల్ల లెన్ని ఉన్ననేమి
ఎడద లన్ని ఒక్కటిరా
గొంతు లెన్ని ఉన్ననేమి
గుండె పాట ఒక్కటిరా