విరహ గీతం
విరహ గీతం


వరూధిని ప్రవరాఖ్యులలా
మనల్ని వర్ణించినా
నాకు అర్థం కాదు
నా మోహం
నువ్వు నన్ను హత్తుకున్నప్పుడు
నే నీ కురులను తాకితే కానీ పోదు
ఏ పరిచయం లేని నువ్వు
నా దేహానికి ఎలా ఇంత ప్రియమైనావు
నా హృదయాన్ని ఎలా ఆక్రమించావు
ఒక్కోసారి నీ మాటలు నాకస్సలు అర్థం కావు
కానీ అవి రెహ్మాన్ ఫ్యూజన్ లా బాగుంటాయి
మన పరిచయం
నువ్వు దగ్గరగా ఉన్నా
విరహ గీతం పాడిస్తోంది
ఎంత వివరించినా
ఎందుకో మరి
నాకు అర్థం కాదు.