STORYMIRROR

Malleswari Kolla

Drama Romance Others

4  

Malleswari Kolla

Drama Romance Others

వేదనాభరితమైన అక్షరాలు

వేదనాభరితమైన అక్షరాలు

1 min
299

మాట మూగబోయింది

కానీ మనసులో కన్నీటి రొదలు కలవు...!!

మౌనం ఒక మారణాయుధంగా మారుతుంది

మరో మాటను మాట్లాడలేక...!!

గుండెను పిండేసే బాధ కన్నీరుగా మారి...

బయటికి రాకుండా ఆపాలని చేసే

ప్రతి ప్రయత్నంలో గెలవలేక...

నీతో మాట్లాడకుండా...

నీకు దూరంగా ఉండలేక...

మనిషిగా క్షమించుకోలేక...

మనసును బ్రతికించుకోలేక...

మౌనాన్ని భరించలేక...

వెలుగును చూడటం ఇష్టం లేక...

నాలో నన్ను వెతుక్కోలేక...

విధిరాతకు ఎదురు పోరాడి జయించలేక...

రేపటి కోసం ఎదురుచూస్తూ కన్నీటి కలంతో నా మనసు పుస్తకంలో నేను రాసుకుంటున్న వేదనాభరితమైన అక్షరాలు ఇవన్నీ...!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama