గుండె కడలి
గుండె కడలి
నువు పక్కన లేనిలోటు..ఎంతంటే ఏం చెప్పను..!
గుండెకడలి అలలసడికి..రాగాలను ఏం కూర్చను..!
నా లోపల నీవుంటివె..పలుకమందు పిలువగనే..
అసలుప్రేమ మధుశాలది..ఎవరికైన ఏం చూపను..!
తలనిమిరే నీ చేయే..తోడుంటే స్వర్గమేను..
నరకమెలా ఉంటుందో..వేరేగా ఏం తెలుపను..!
అందమైన భావనమే..నిజవసంత వనవాటిక..
పట్టుకెళ్ళి పోయావుగ..ఒకపాటగ ఏం పాడను..!
ఆకాశం చూస్తుండగ..కుప్పకూలె మేఘమాల..
దిమ్మతిరుగు దిమ్మరింపు..సాక్షినైతి ఏం వ్రాయను..!
బస్సులేవొ కారులేవొ..ఆస్తులు అంతస్తులేవొ..
కానరాని రాదారుల..ఘోషనింక ఏం పలకను..!
