గోముగా
గోముగా
చెలి నడకల సొగసుజూసి..మోజుపడితి గోముగా..!
అందమంటె తనదేనని..కవితలల్లితి గోముగా..!
కాలుతొక్కి సైగ చేయ..మాటలెట్లా వచ్చునోయ్..
స్వర్గమనగ తన జతయని..పైకి చెబితి గోముగా..!
కొప్పుచాటు మల్లెనవ్వు..అర్థమయిన ఒట్టులే..
నలిగితాను పరిమళించె..మది 'నలిగితి' గోముగా..!
మనసుగొడవ ఎఱుగలేని..ఊయలమంచ మేదో..
నోరారా క్షమాపణలు..నే అడిగితి గోముగా..!
ప్రేమవిలువ తెలియలేని..మూర్ఖత్వం ఏమిటో..
అహంకారం అడ్డుతగుల..ఓ నసిగితి గోముగా..!

