Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Action Classics Inspirational

4.5  

jayanth kaweeshwar

Action Classics Inspirational

గో మాత - గొప్పతనం కవితా శీర్షిక (prompt -3)

గో మాత - గొప్పతనం కవితా శీర్షిక (prompt -3)

1 min
214


గో మాత - గొప్పతనం ( వచన కవిత ) 3-5-2021 కవీశ్వర్ 

జంతువులలోకెల్లా అతి సాధుజంతువు గోమాతే కదా !

ఉపయుక్తమగు జంతువులలోకెల్లా ముఖ్యమైన జంతువూ ఇదే కదా !

కామధేనువన్నా , సురభి అన్నా పసుపు కుంకుమలతో పూజించేది దీనినే కదా !

ముక్కోటి దేవతలు కొలువుండేది ఈ గోమాతలోనే కదా !


పుష్టికరమైన పాలనిచ్చేది , సేంద్రియ ఎరువులనిచ్చేది ఈ మాతే కదా !

పాడిపంటలను అభివృద్ధి పరిచేది , మన పోషణ భారాన్ని పెంచేదిదే కదా !

పురాణేతిహాసాలలో మనం స్ఫురణకు తెచ్చుకునే ఈ గో కథలనే కదా !

గోసేవ మనకది అతి పవిత్రకార్యమే ఎల్లప్పుడూ నెరిపేది మనమే కదా !


ప్రవేశ కార్యములందు, కోడెమ్రొక్కులయందు మనము చేసే పుణ్యకార్యమిదే కదా !

మన అభివృద్ధిలో , వృషభ , గోవులను తప్పక రక్షించేది మనమే కదా !

వీటిని మనము ధర్మము తో రక్షిస్తే - మనను ఇవి మనను పరోక్షంగా రక్షించును కదా !

అందుకే నెపమును త్రోసి, రక్షణ చేసి గోవులను కాపాడితే అది లోక, సమాజ హితము కదా !

వ్యాఖ్య : హితోక్తి : 

" పాడి- పంటలను పెంచేది గో- వృషభరాజాలే (మహిషా దులు) మనల్ని ప్రత్యక్షంగా , పరోక్షంగా అవి మనల్ని 

తెలివి, జ్ఞానం, శారీరక మానసిక అభివృద్ధిని పెంపొందించును . అందుకని మనం మన , సామజిక హితంకోసం 

తప్పక రక్షించాలి." 

"వినరా , వినరా నరుడా ! తెలుసుకోర పామరుడా ఈ పాట గోవుల గోపన్న చిత్రం లో ఉన్నది గోమాత గొప్పతనం గురించి 

గొప్పగా చెప్పారు . ఇంకా రావమ్మా మహాలక్ష్మి రావమ్మా ఉందమ్మా బొట్టు పెడుతా చిత్రం లో ఉన్నది ఇది కూడా గోవుల గురించి 

సంక్రాంతి పండుగ గొప్పతనం గూర్చి చెప్పారు.

హితోక్తి :" గోవుల రక్షణే మన సనాతన ధర్మ రక్షణ : రక్షణ మనది - ఫలితం కూడా మనకే "

కవీశ్వర్ జయంత్ కుమార్ హైదరాబాద్ :

 



Rate this content
Log in

Similar telugu poem from Action