గమ్యం గమనం
గమ్యం గమనం
గమ్యం గమనం
****************
ఒక్క అడుగు తోనే గమనం మొదలు
వెనుదిరిగి చూడకుండా
సాగించు సవ్యంగా
సాధనతోనే సాధ్యం ఏదైనా
నిరాశనిస్పృహను దరి చేరనీకు
వెన్నుతట్టే వారు వెంట రాకున్నా
చేయిపట్టి నడిపేవారు లేకున్నా
ఆశనే శ్వాసగా మార్చి
నేర్పుకు సానపెట్టి సాగిపో
అదరక బెదరక కుదురుగ మెదులుతు
లక్ష్యం పై గురి పెట్టు
జీవన వాహిని సవ్యంగా సాగితే
ఏముంది ప్రత్యేకత
మనోసంకల్పం ముందు
అసాధ్యమన్నది
మోకరిల్లక తప్పదు తల్లి
గమనం సాగించు గమ్యం సాధించు
