గదిలో
గదిలో
నలుగురుంటారు ఏమీ అనిపించదు
ఒకడు రాగానే అంతా మారిపోతుంది
వాతావరణంలో వసంతం ప్రవేశిస్తుంది
కాంతికి వెలుగొస్తుంది
మాటలకు యవ్వనమొస్తుంది
రక్త ప్రసరణ మహానదిలా సాగుతుంది
మళ్ళా అతనొక్కడే
అట్టే తేడా లేదు
సున్నా పక్కన నిల్చొని ఓ మహాసంఖ్యను స్రుష్టిస్తాడు
అనంత శూన్యాన్ని శక్తితో నింపేస్తాడు
ఆరిపోయిన దీపాలు శిరసెత్తుతాయి
సకల లోకాలు అతని ఆలింగనాన్ని కోరుతాయి
ప్రేమతో పుష్పవృష్టి కురిపిస్తాయి
అధినాయకుడని కీర్తిస్తాయి
అటవీ దేవదారుల్లోకి కొత్త రుతువొచ్చి
ఊయలలూగుతుంది
మోదువారిన నితంబ వృక్ష శాఖల చిగుర్లలోకి
కోయల వచ్చి
కూర్చుంటుంది
మైదానమంతా ఆలివు గ్రీను రంగు కప్పుకుంటుంది
చలికి వణకదు
భయానికి చలించదు...
... సిరి ✍️❤️
