STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఎవ్వరివి

ఎవ్వరివి

1 min
204

కాలిమువ్వల సడిని చెవులలో వొలికించు చరణాలు ఎవ్వరివి 

మేలుకొలిపే వేళ రెప్పలను చుంబించు అధరాలు ఎవ్వరివి


కన్యకలు కనబడే స్వప్నాలు చూడడం తప్పు అనుకుంటాను   

మోమాటపడుతున్న చూపులను కవ్వించు పరువాలు ఎవ్వరివి

 

రోజాల తోటలను వేలాది పెంచడం కష్టమనుకున్నాను 

తలవంచి నేలపై బిడియాలు నాటించు నయనాలు ఎవ్వరివి


దేవశిల్పికి లేని నేర్పుతో తనువులో నిర్మించుకున్నాది  

అప్సరలలో లేని అందాలు నివసించు నిలయాలు ఎవ్వరివి


మొసలికన్నీటితో నిండిపోయిన కనుల చిత్రాలు ఉంటాయి 

శాంతపరిచేవరకు నీళ్లలో నిప్పులను పుట్టించు కలహాలు ఎవ్వరివి


మన్మథుని దగ్గరే విలువిద్యలో సులువు తెలుసుకొని గెలిచింది 

పూలబాణములేసి విరహాన్ని వోడించు కదనాలు ఎవ్వరివి 


తారకలు లేనపుడు చాయలకు రాకూడదంటుంది 'నెలరాజ'  

రాత్రులకు శృంగారలోకాన్ని చూపించు సరసాలు ఎవ్వరివి 


Rate this content
Log in

Similar telugu poem from Romance