ఎర్ర గులాబీ
ఎర్ర గులాబీ
ఎర్రగులాబీ అంద చూసి అర్రులు చాచావో
ఎర్రని రక్తం కళ్ళచూస్తావు జాగ్రత్త
ప్రేమ అమృతం అనుకుని పరుగులు తీసావో
ప్రాణం పణంగా పెట్టాలి జాగ్రత్త
మనసు పడ్డావని వెంట పడ్డావో
మోసం అడ్డంగా పడేస్తుంది జాగ్రత్త
కొత్తలోకం పిలుస్తుందని రివ్వున ఎగిరావో
కొత్త కత్తి నిలువునా చీలుస్తుంది జాగ్రత్త
అమ్మకానికి నమ్మకమే పునాది
ప్రేమ గొందిలో పడ్డావో జీవితం సమాధి
