ఎంత ప్రేమో...శ్రీనివాస భారతి
ఎంత ప్రేమో...శ్రీనివాస భారతి


నీ మీద నేనెంత కక్కించినా
చిరునవ్వున స్వీకరిస్తావు
నులిపేసి విసిరేసినా
నవ్వుతూ పలకరిస్తావు
బుట్టలో పెట్టి..
ఊపిరాగేలా చేసినా
అదేనవ్వు నీ మొహంలో
నాబలంతో దాడి చేసినా
మనోనిబ్బరమే నీకు
స్వచ్ఛమైన నిన్ను
మచ్చల తో అలంకరించినా
జేబులో దాచి జోకొట్టినా
బాధని మనసులో దాచి
కవి సమ్మేళనంలో
నా గొంతులో పలికి
స్వేచ్చా వాయువులు పీలుస్తావ్
నేనంటే ఎంత ప్రేమో నీకు..
౼౼౼౼౼౼౼౼®®®®®®®®®®®౼౼