ఎంత చిత్రం
ఎంత చిత్రం
కథలవెంబడి కాలచక్రం తిరుగుతుంటే ఎంత చిత్రం! వెన్నెలంటీ గతము పూలుగ రాలుతుంటే ఎంత చిత్రం! గుండెశిలనే కరగమంటే సాధ్యమవునా ఓయి శ్యామల! ప్రేమ వాహిని మంచు ముద్దగ మారుతుంటే ఎంత చిత్రం! వలపుతోటలొ విరులమాటే మరచిపొమ్మను మాట దేనికి? కవన వనిలో. తరులజాడే. చూడనంటే ఎంతచిత్రం! ఙ్ఞాపకాలనె ఒడిని నింపీ, చాలు చాలను పదము ఎందుకు? కలిమిలేముల కలిసి నడువగ ,కూడదంటే ఎంత చిత్రం! వెండివెన్నెల కురియు రాజే అమావాస్యలొ దాగలేదా? జీవకళలను దారినంతా మూసుకుంటే ఎంత చిత్రం!
