ఎందుకే సందెగాలి
ఎందుకే సందెగాలి


ఎందుకే సందెగాలి
ఆమె పమిట లాగుతావు
అతడి చూపుల వేడి ఆమెకు తగలాలనా
విరహ వేదన అతనిలో రగల్చాలనా
ఎందుకే సందెగాలి
ఆమెను చూసి ఈల వేస్తావు
అతడిని చూసి ఆమె గోల చేయాలనా
అతడి తలపుల్లో ఆమె నిలిచిపోవాలనా
ఎందుకే సందెగాలి
ఎందుకే అంత గడుసుదనం
కాస్త అల్లరి ఆపవే
ప్రేయసీ ప్రియుల చిరు చెమటలు తుడువవే