ఎండాకాలం
ఎండాకాలం
ఎండాకాలమొచ్చిందిరో ఎంకటేశ
చాలాకాలముంటాదిరో
వేడి వేడి గున్నదిరో ఎంకటేశ
మంట మండిపోతాందిరో !!
మంచి నీళ్లు తాజాగా నేను మంచినీళ్ల బావికెళ్తే
నీరు మండిపోతాందిరో ఎంకటేశ
నోరు ఎండిపోతాందిరో
చల్ల గాలి కరువాయేరో ఎంకటేశ
బ్రతుకులింక బరువాయేరో !!
కూరగాయలు తెద్దామని సాయంకాలం సంతకెళ్తే
నింగి మండిపోతాందిరో ఎంకటేశ
నెల మండిపోతాందిరో మాడు పగిలి పోతాందిరో ఎంకటేశ
గోడు మిగిలిపోతాందిరో !!
ఎర్రబడ్డ సూర్యుడేందిరో ఎంకటేశ
బుర్రవాయగొడతాండు రో
దిమ్మ దిరిగి పోతందిరో ఎంకటేశ
అమ్మ గుర్తుకొస్తాన్దిరో !!
ఎండా బాధ తాళలేక ఏసీ రూమ్ సినిమా కెళ్తే
ఏసీ వెయ్యకున్నదురో ఎంకటేశ
మోసం జెసి సంపాడురో
ఉక్కపోతగున్నాదిరో ఎంకటేశ
తిక్క తిక్కగున్నాదిరో !!
ఎరువు బస్తాలు తెద్దామని ఎర్ర బస్సుల బస్తికెళ్తే
బట్టలంటుకున్నయిరో ఎంకటేశ
ఒంటికంటుకున్నాయిరో
వళ్ళు చెమట గున్నాదిరో ఎంకటేశ
కళ్ళు బైర్లు కమ్మాయిరో !!
ఆకలేసి ఇడ్లీ వాడ తిందామని హోటల్ కెళ్తే
వడదెబ్బ కొట్టిందిరో ఎంకటేశ
చావు దెబ్బ తీసిందిరో
గుడ్లు తేల బెట్టానురో ఎంకటేశ
గుడ్లగూబనయ్యానురో !!
ఎండాకాలమొచ్చిందిరో ఎంకటేశ
పోయేకాలమొచ్చిందిరో
నల్లబడ్డ వాళ్ళు చూడరో ఎంకటేశ
సల్లబడే రోజు ఏదిరో !!