ఏంటో ఈ రోజు నీ పై ప్రేమ
ఏంటో ఈ రోజు నీ పై ప్రేమ
ఏంటో ఈరోజు నీపై ప్రేమ ఎక్కువై పోతుంది
ఎప్పుడూ నిన్ను చూస్తూ అలా ఉండిపోవాలని
ఆశే యదకు ఎందుకంటావ్ నిన్ను చూస్తే ఎక్కడి నుంచో
మధువు వరద గోదారై మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
చిలిపితనం చిలిపిగా చేరిపోతూ మనసైన
నిన్ను గిల్లాలనే ఆశే ఆ చిలిపి అల్లరిలో
నువ్వు సిగ్గుతో ముడుచుకు పోతుంటే
మదికి ఎంత అధ్బుతమైన భావనో
మరి తీయగ చేరిపోతుంది ఏంటో....
నీతో అల్లరి మొదలెట్టాలనుంది

