STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఏమని చెప్పను నేస్తం

ఏమని చెప్పను నేస్తం

1 min
394


కాలగర్భాన కలసిపోయే కన్నీటి గాధను  


అందరికీ దూరమైపోతున్న అనాధ బాధను 


నాగరిక సమాజాన నవ్యతకై పరుగులే తీసాడో 

పునాదులే మరచి ఆదివాసిగా ఆనందమే పొందాడో .


అది వయసు విలాసాల తాలూకూ ప్రమోదమో 

లేక వలపు విలాపాల తాలూకా ప్రభావమో 


మనసుపొరలలో కొనసాగుతున్న అంతర్యుద్దమో 

మనుషులను చదవలేని అవగాహనారాహిత్యమో 


హృదయం ఉన్నా ప్రేమించిన ప్రేయసి దూరమై,

అనురాగమున్నా పంచుకునే తోడు మృగ్యమై,ఆరిపోతుంది ఆ జీవితం.


ఆనందం ఆవిరై,మధువే మధురమై,ధూమమే దగ్గరై,

మరణమే ప్రణయమై .


చీకటి వెలుగున,కాలం మరుగున,కన్నీటి మడుగున,ఓటమి తోడున,

ఆగిపోవాలి ఆ శ్వాశ .... అంతా 


Rate this content
Log in

Similar telugu poem from Romance