ఏమంచు
ఏమంచు
పన్నెండు ప్రాణాల..దారాల ప్రోగుగా..!
అందకే అందాల..రాగాల పూవుగా..!
మెండైన విరహమే..ఏకాంత మదిలేక..
పెనుదు:ఖ సీమలో..తాపాల తనువుగా..!
ఈ ప్రేమయే చితికి..తరలించు వారధే..
ఎడతెగని మోహాల..బంధాల తేరుగా..!
ఏ మంచు బిందువో..లాలింప వచ్చునా..
మురిపాల కలహాల..జన్మాల గోడుగా..!
వాదించు కలహంస..వేదించు ముచ్చటే..
సాధనా పథములో..గంధాల వాగుగా..!

