STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఏ వేళ

ఏ వేళ

1 min
401

తలనిమిరి వెళ్ళమని..అడుగనే ఏవేళ..! 

నిదురించు ముచ్చటది..తలచనే ఏవేళ..! 


కనులెదుటి కలనీవె..కలయేదొ మరి ఏల.. 

కనుపాప లింటినే..మరువనే ఏవేళ..! 


నినుగాక ఎదలయల..చూసుకోవలె నేమి.. 

నీ గుండె తడితీపి..పలుకనే ఏవేళ..! 


రేయితో మాటాడు..చంద్రికల రాశివే.. 

నీ పాట నేగాక..పాడనే ఏవేళ..! 


యేటిపై తెఱచాప..నేగాలి కదుపునో.. 

నీదిశగ గాకుండ..కదలనే ఏవేళ..! 


ఈశ్వాస దీపాల..ప్రాణమే నీదిలే.. 

నీప్రేమ గగనమది..వీడనే ఏవేళ..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance