ఎదురు చూపులు
ఎదురు చూపులు


ప||
ప్రియతమా కాలం గడిచిపోతున్నది జాడేది
సమయమా కలసిరా ఓ పూలే కాదే వాడేది |2|
చ||
వేచిన మనసుకు వేకువ ఎప్పుడే ఏతెంచేనే
దాచిన వలపే దాపరికాన్ని పూర్తిగా తెంచెనే |2|
ముద్దు ముచ్చటలకే అదునూ తానవునంది
పొద్దు వాలక మునుపే మురిపెమే పోనుంది |ప|
చ||
మిగిల్చిపోవా నెమరించను తీపి జ్ఞాపకాలు
వచ్చిపోవా వరసైన వేళలో తీర్చ వేడికోలు |2|
కొసరి కోరికేమో కొండెక్కనుంది మరికోరకనే
సరిచేయను సరసము కోరదుగా మరొకరినే |ప|
చ||
ఎద మొత్తం వెలితాయే ఎడబాటునే తలచి
మదిలోని ముసిమి మసకబారే నిను కొలిచి |2|
తూర్పు భాను కిరణంలా నీవు ప్రభవించవా
మార్పునే తెచ్చి మరులుకాంతి వెలిగించవా |ప|