ఎదలో ఊహలు
ఎదలో ఊహలు
మమిలమిల నక్షత్రాలను ఏరుకుని వచ్చాలే..
గలగల గాజుల్లోనే వాటిని ఉంచాలే
కుహుకుహు పాటల్లోని తీపిని అడిగాలే.
నా పలుకుల సరిగమలోన దానిని నింపాలే..
గుసగుసలాడే గాలిని ఊపిరిలో కలిపాలే.
సుమగంధాలను చిందే శ్వాసలు నావన్నాలో
చకచక సాగే అడుగుల గమనం నాదేలే..
ఎక్కడెక్కడికో పరుగులు గమ్యం చేరేలే.
మిసమిస మెరుపుల సొగసులు కాస్త దోచాలే..
చినుకుల కులుకులు మబ్బుని వీడిన వేళే..
గుప్పుగుప్పున ఆశలు ఏవో ఎగసిన జ్వాలే.
చప్పుడు చేసే ఎదలో ఊహల ఉప్పెనలై !

