ఎదలో దాగిన ప్రేమ
ఎదలో దాగిన ప్రేమ
వగరు నీదే
వయ్యారము నాదే
పొగరు నీవే
అలంకారమూ నాదే
తలపు నీవే
తన్మయత్వమూ నీవే!
సొగసు నాదే
సొగసు మాటు మనసునీదే
కనులు తెరచి చూస్తే ఏమీ కనపడదే
మనసు తలుపు తెరచి చూస్తే
నీ రూపం మాత్రం ప్రత్యక్షం
ఎదలో దాగిన ప్రేమ పరిమళాన్ని
మనసు నిండా పంచావు......
.
.

