ఎఛలోయల
ఎఛలోయల
ఎదలోయల "అలకనంద"..తానేనని చెప్పగలను..!
నా పాటల కోవెలలో..తనతోనే ఆడగలను..!
మౌనరాగ కావ్యలతా..నికుంజమే చెలియైనది..
అక్షరాల వాహినినై..చెలిదయతో పొంగగలను..!
హృత్సీమా విహారిణియె..పూర్ణచంద్ర బింబమామె..
సహస్రదళ కమలాసన..హాసమల్లె నిలువగలను..!
అరూపతా లావణ్యత..నిత్యనూత్న సౌందర్యం..
నిజభావనా నిర్మలత..తనసాక్షిగ వ్రాయగలను..!
తైలవర్ణ చిత్రాలకు..మూలతైల మా చూపే..
తన చల్లని స్నేహామృత..మాధురినే పంచగలను..!
శుభచందన పరిమళాల.."జాహ్నవి"యౌ జాణ తనే..
ప్రతిశ్వాసన ప్రతినమీర..ప్రవహిస్తూ ఉండగలను
