దృవాల వైపు ప్రేమ యాత్ర
దృవాల వైపు ప్రేమ యాత్ర
రా ప్రియతమ!
మన ఎడారి ప్రేమ యాత్ర తరువాత
శాశ్వత మానవ ఆవాసాలు లేని మరియు
ఈ ప్రపంచపు టైం జోన్ చూపించని
సామ్రాజ్యంలో విహరిద్దాం......
మంచు గడ్డల మీదుగా ఓడలో ప్రయాణిద్దాం
ఆ ఓడ మంచులో ఆగిపోతే స్కీలమీద వెళ్ళాదాం
సంవత్సరానికి ఒకసారి మాత్రమే
సూర్యుడు ఉదయించి అస్తమించే
ప్రాంతానికి మన చివరి ప్రేమ యాత్ర చేద్దాం....
మన ప్రేమకు చిహ్నంగా నా గుండెల మీది
పైట కొంగును జెండాగా ఎగురవేద్దాం
నా తపనల గమ్యం నేవైనప్పుడు
నీ ఊహల రూపం నేనె కదా
నా ప్రేమ కక్ష్య లక్ష్యం నీవే అని
అది ప్రకృతి ప్రసాదించిన
గురుత్వాకర్షణ అని నీకు తెలియద
అందుకే మన ఇరువురి మనస్సులు
భూమి సూర్యుడి చుట్టూ తిరుగాడినట్టు
నేను ఏ దిక్కున ఉన్న, నీవు ఎటు వైపు సాగిన
ఆ దిశలన్నీ రేఖాంశాల వలె నీ వైపే చూపిస్తాయి
ఎందుకంటే ......
నేనొక ఉత్తర ధ్రువమైతే
నీవొక దక్షిణ దృవానివి కదా
ఈ రెండు భిన్న దృవాలను కలుపుతున్న
మన ఇద్దరి మనస్సు మంచుల కరిగి
కడలి ఒడికి అలలా ప్రయాణించి
ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు
ఖండాంతరాలు ప్రవహిస్తూ దాటుతూ
ప్రతి ప్రాణిని తాకుతూ
ప్రతి మనిషిలో జీవన విత్తనాలు నాటుతూ
ప్రతి మనస్సులో ఆశలను మొలకెత్తిస్తూ
ప్రతి హృదయంలో ప్రేమను చిగురింపజేస్తూ
ఈ భూమిని ప్రేమ పరిమళ భరితం చేసి
శత్రుత్వం, యుద్దాలు, అణు ఆయుధాలు లేని
ఒక అందమైన ప్రపంచాన్ని పరిచయం చేసి
ప్రేమ అమరత్వ తత్వం ఆధ్యాత్మిక తత్వమే
అని ఎలుగెత్తి చాటుతూ మన చివరి శ్వాసను
ఈ విశ్వ మానవాళికి కొరకు త్యాగం చేసి
నిష్క్రమించి ఈ విశ్వ ఆరాలతో
సూర్యోదయనికి మళ్ళీ ఉదయించుదాం
రా ప్రియతమ!
మన చివరి ధ్రువపు ప్రేమ యాత్రకు.....
నీవు వస్తావని ఆశతో ఎదురు చూస్తూ
నీ ప్రేమికురాలు.....

