దిగులుపిట్ట
దిగులుపిట్ట
మూగదైన దిగులుపిట్ట..మనసెవరికి పట్టేనట..!?
ఆత్మీయత చిరునామా..అసలెవరికి అందేనట..!?
తెగిన గాలి పటాల్లా..ఎవరైనా తెగబడితే..
అనురాగపు వీణసాక్షి..చూపెవరికి తెలిసేనట..!?
మధుమేహపు వేదనంటి..కాఫీయే బతుకుపాట..
'చేదు-తీపి' గ్రోలుటలో..పట్టెవరికి చిక్కేనట..!?
లోపలున్న నటరాజే..అవాక్కగుట జరుగునులే..
బంధం విలువది కాచే..గుణమెవరికి ఉండేనట..!?
వింత బొమ్మలాటలోన..అమ్మప్రేమ అడవిపాలు..
వెన్నునిమిరి ఓదార్చే..పాలెవరికి పొంగేనట..!?
కాలాన్నేం నిందిస్తాం..నిలకడయే కడబడితే..
కనిపించని దారమేదొ..ముద్దెవరికి వచ్చేనట..!?
