దేహం
దేహం
దేహం పరవశం
తృప్తి పున్నాగ పూలతో దేహం,
అలరించిన ముద్దుగా తోచు ,
హృదయం పచ్చని పైరులా వీచు,
తంగేడు పూలులా ఉప్పొంగు
మనసు,ఎంతటి తీరికలేని మహా
రాజైనను ఒకింత స్వకాంతను
చేరి స్పృశించు మొగిలి పూవులా,
సుఖించు సున్నితంగా,కలిపి
ఉంచేది వందేళ్ళు జంటలను ఈ
ఆనందమే కదా! నిక్కము సుమీ.
