డైమండ్
డైమండ్
విశ్వంలో ఎంతో విలువైనది
ప్రతి ఒక్కరూ కొనలేనిది
అమూల్యమైనది ఈ డైమండ్
అది ఉన్నవాడు కుబేరుడుతో సమానం!
వజ్రాల కన్నా వైడూర్యాలు కన్నా
విలువైనది ప్రేమ
నీ కోసం పరితపించి
నీ క్షేమాన్ని తలచి
నీ ఉన్నతికి సహకరించే మనసు
అది వజ్రం కన్నా విలువైనది !
తలవగానే నీ మోముపై
చిరునవ్వుని కలిగించేది
అది ఏ బంధమైనా
విలువ కట్టలేనిది
స్వచ్ఛమైనది
విశ్వంలో అతీతమైనది!
మరి వజ్రం కన్నా విలువైన ప్రేమ పొందిన
ప్రతి ఒక్కరూ కుబేరులే
ధనం అహాన్ని పెంచితే
ప్రేమ ఆప్యాయతని నిలుపుతుంది
అందుకే వజ్రం కన్నా విలువైన
మనుషులను వదులుకోకండి!
ఎన్ని కోట్లు పెట్టి కొన్న దొరకని ప్రేమ, స్నేహం
అది కొందరి పాలిట వరం
మరికొందరికి దొరకని శాపం
అటువంటి ప్రేమ దొరికితే
నిలుపుకో కలకాలం!!
--జ్యోతి మువ్వల
16/4/21
