STORYMIRROR

Challa Sri Gouri

Abstract Tragedy Classics

4  

Challa Sri Gouri

Abstract Tragedy Classics

దైవమే నా తోడు

దైవమే నా తోడు

1 min
354

కష్టాల కడలిలో నీ పయనం సాగుతున్న వేళ

నా అనేవారు దూరమైన బాధతో నీ గుండె వెలవెలబోతున్న వేళ

పయనంలో తొందరపాటు అడుగులో తడబాటు నీ మిత్రులైన వేళ

అన్నీ ఉన్నా అనుభవించలేని పేదరికం నీదైతే

డబ్బు మాయలో బంధాలను మర్చిపోయిన వారి తోడు నువ్వు కోల్పోతే

ఇదంతా భారమై నీ హృదయం నలిగిపోతే

గుర్తించు గుర్తించు

నిన్ను నీడలా వెంటాడే నీ తోడు ఉందని గుర్తించు

నీ ఆత్మ స్థైర్యాన్ని నిలిపే ఆ దేవుడి అండ ఉందని గుర్తించు

నీతిని రక్షించే పరమాత్ముని కృప ఉందని గుర్తించు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract