STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

3  

Dinakar Reddy

Abstract Inspirational

దైవమే దీపంగా వెలుగు

దైవమే దీపంగా వెలుగు

1 min
191

అజ్ఞానమనే చీకటి

అన్ని వైపులా ఉంది

అంతా నాదే అనుకుంటూ

తను శాశ్వతమనుకుంటూ


ఆశా పాశాల మోహంలో

అంతు చిక్కని సమస్యల గమనంలో

హేతు వాదమా

సిద్ధాంతమా


ఏది గొప్ప ఏదో గొప్ప

నాది గొప్ప నాదే గొప్ప

అని మిడిమిడి జ్ఞానంతో

వదరుకునే ఓ మనిషీ


అన్ని జీవరాశుల సృష్టికీ మూలము

ఈ విశ్వంలోని శక్తికి ఆధారమూ

సర్వేశ్వరుడే అని

అహంకారాన్ని వదలి

ఆత్మ సమర్పణ భావంతో

కరుణను నింపుకుని

ధర్మ మార్గమున నడుపమని


వెలిగించు నీవు కార్తీక దీపం

ఆ దైవమే దీపంగా వెలుగు

నిన్ను నువ్వు ఉద్ధరించుకునే మార్గము చూపు

నిజమైన భక్తి నీకు 

విచక్షణ నిబద్దత నేర్పునురా

బహు దూరపు బాటసారి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract