STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

చూస్తూన్నా

చూస్తూన్నా

1 min
2


నీ అడుగుల జాడలలో..నడవాలని చూస్తున్నా..!

నీ పదముల గంధనదిగ..మిగలాలని చూస్తున్నా..!


అక్షరాల చెలిమిసాక్షి..దాచుకున్న ప్రేమలేఖ..

కనికరించి దరిచేరిన..ఇవ్వాలని చూస్తున్నా..!


తలపులన్ని మాయమయే..సమాధిలో దీపమా..

మందహాస మందిరమై..నిలవాలని చూస్తున్నా..!


తుదిమొదలే ఎఱుగలేని..చదువేదో ఎందుకో..

కలహంసల అలజడినే..మాన్పాలని చూస్తున్నా..!


ఊపిరిలా ఉండగనే..నీతోనే కలవాలి.. 

నిజ ఉత్తర ద్వారమేదొ..దాటాలని చూస్తున్నా..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance