చంపేస్తారా? ...శ్రీనివాస భారతి
చంపేస్తారా? ...శ్రీనివాస భారతి


శరీరం
నల్లగా ఉందని
పెదవి విరుస్తారా?
నాకూ ఓ మనసుంటుంది...
జీవితం పంచుకోవాలని ఉంది.
తెల్లతోలు ఐతే చాలా?
వికృత మనసు ఉంటే
జీవితాంతం భరిస్తారా?
మీ
అనుమానపు దృక్కులు
భరించలేక
వాళ్ళుకూడా
చిన్నవయసులోనే
మీ క్రూర ఆలోచన్ల వలయంలో చిక్కి
ఆత్మ త్యాగం ..చేసుకుంటున్నారే?
మిమ్మల్ని
ఇంకోలా.. సుఖపెట్టాలంటే
నా వర్ణం ఏదైనా పర్లేదా?
భార్యగా మాత్రం సరిపోనా?
వస్తూ...చూస్తూ....పోతూ
ఇంకా
ఈ మనసుల్ని చంపేస్తారెందుకు?
------౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧------