చంద్రమా
చంద్రమా
రెప్పచాటులో నిన్ను దాచి
నింగికేసి వెతుకుతున్నా ఏమిటో చంద్రమా
అందనంత ఎత్తులో ఉన్నావని
వరముగా దొరికావో లేక దిగులుతో క్రుంగదీస్తున్నావో
అరక్షణం వీడక నీ ఊహలో నా కెన్ని ఊసులు
నీ సావాసం నన్ను ఒంటరిని చేస్తూ పిచ్చి భ్రమలో
శతాధిక ప్రశ్నలన్నీటికి జవాబుగా నిలిచి
నాలో ఆనందాల మకరందాన్ని తీసుకొచ్చావు
నీ తలపు ఊహలో మాత్రమే సుమా
నిజానికి నన్ను చదవలేని వీరుడవు నీవు మగదీరా
ఓరిమికి గుర్తుగా నేను మిగిలాను
నీ మనస్సు అద్దాన్ని చదివేసి
సింహం వంటి గాంబీర్యంత
నీవు మిగిలావు నన్ను వదిలేసి...
.. సిరి ✍️❤️

