చివరిసారిగా
చివరిసారిగా
నిత్య పోరులో ఏది చివరి, ఏది మొదలు ఓ వలయంగా ప్రతిదీ చర్విత చరణాలు మనిషి జీవితాన ఏ ఓటమి చివరిది కాదు తాను గెలిచిన ఏ గెలుపు శాశ్వతం అవదు ఈ జనన మరణాలు, బతుకు సమరాలు తొలి శ్వాసతో మొదలై, తుదిశ్వాస దాకా పడుతూ లేస్తూ, నిత్యం చస్తూ బతుకుతూ ఓ కెరటానికి తాకిన దెబ్బల్లా, ఎగసే కెరటంలా అనుకుంటాం ఇదే చివరి తప్పని, ఒప్పని ఓడిన్నాడు మరో గెలుపు లేదనుకుంటాం ఉన్ననాడు తింటాం, లేనినాడు పంటాం అశాశ్వతమైన జీవితాన ఏదీ కాదు శాశ్వతం మమేకమైన మమతలకు ఏది చివరిది వీడిన మజిలీలో చివరి చూపొక స్మృతి ప్రేమించిన హృదయాన్ని మరిచితే విస్మృతి మొదటి చివరి అనుభూతులే తెలియని తీపి మరణశయ్యపై చివరి చూపొక వేదన చివరి సారిగా పలికిన మాటొక నివేదన దూరమయ్యే కొద్దీ తెలియని సంవేదనా తోడకరుంటే కడచూపుకైనా ఓ నిరీక్షణ దేనికైనా చివరి అంచున ఓ స్వీయ విశ్లేషణ తప్పైతే తప్పని పశ్చాత్తాపం ఓ పరిరక్షణ ఒప్పైతే తుదకు మిగిలే తృప్తికరమైన వీక్షణ చివరి సారిగా అను ఓ మాట, బాటయే రక్షణ చివరి సారిగా చేయు ప్రయత్నం ఓ పాఠం అప్రమత్తంగా లేని ఓటమితో నేర్చే గుణపాఠం ఆచితూచి అడుగులేస్తే చివరిదైనా విజయం చివరిసారిగా మనిషి ఓపికకు తోడుగా జయం !
