STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

చివరి మిల్లు

చివరి మిల్లు

1 min
320

ఆకలి రెక్కలు అలసిపోయి

మనిషి లోపలి యంత్రాలు ముక్కలైపోయాక

చివరి మిల్లు మూసేసారు...


ఎన్నెన్ని తెగిన పోగుల్ని అతికించుకుంటూ

ఎన్నెన్ని అంతరాత్మల్ని అద్దకంగా మార్చితే

ముంబై ప్రపంచం మోహన వస్త్రమై

ఫ్యాషన్ పెరేడ్ చేసింది..?


కండె నుండి దారం తెగిపోయినట్లు

మిల్లు శిథిలాల్లో మూలుగులెన్నో..

చిరునవ్వులు అన్నీ..


జీతం ఘనీభవించి..

కష్టం బతికి బట్టకట్టింది ఈ మిల్లులోనే కదా...

ఎన్ని గుండెలు మిల్లు శబ్దాల్ని విన్పిస్తాయి...

ఎన్ని నరాలు దారపు పొగులై ఉబ్బి కన్పిస్తాయి...

సైరన్ విన్పించక ఎన్ని గొంతులు మూగవోయాయి...


పాడుబడ్డ దొర గడీని చూసినట్టు

'తెరుచుకో సేసేమ్' అని వేల గొంతులెత్తి అరిచినా

కాముని భూతం లా ఉలుకదు.. పలుకదు..

వలస పక్షులన్నీ తలో దిక్కు ఎగిరిపోయాక

ఆకాశాన్ని తాకే అపార్టుమెంట్లతో

రంగుల చిలకై లేచి రెక్కలు దులుపుకుంటుంది...


యంత్రం జీవితాన్ని నియంత్రించాక

దిక్కుతోచక..

అక్షరాల్ని మంత్రిస్తున్నాను...

ఇప్పుడు ఎవరు శాలువా కప్పినా

మిల్లు శబ్దాలే విన్పిస్తున్నాయి..!


Rate this content
Log in

Similar telugu poem from Inspirational