STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

చిట్టి మనసు

చిట్టి మనసు

1 min
6


ప్రపంచాన్ని శాసించే..ఆశలేదు రూపాయికి..! 
భయం ఎలా ఉంటుందో..తెలియదోయి సత్యానికి..! 

అహంకార మెవరినైన..అపహాస్యం చేయవచ్చు.. 
నిలదీస్తూ పేల్చివేయు..బలమున్నది గాయానికి..! 

కదిలే బొమ్మల కొలువిది..ఏది ఎపుడు దిగిపోవునొ.. 
సమాధాన మెవరిత్తురు..చిట్టి మనసు పాపాయికి..! 

ఏమి ధనం ఏది ధనం..దాచగాను కుదిరేనా..
సాటివచ్చు ధనమేదట..తిరిగిరాని కాలానికి..! 

శ్వాసపూల గదిసాక్షిగ..జన్మకథలు రాలేనా.. 
పాఠమేదొ కలదేమిటి..ఎఱుకనున్న మధుపాయికి..!

దురాక్రమణ బుద్ధి సరిగ..వదిలించే దైవమెవరు.. 
ఎల్లలెలా ఉంటాయట..విశ్వప్రేమ రాజ్యానికి..!


Rate this content
Log in

Similar telugu poem from Classics