చిత్రంలో కుంచె..
చిత్రంలో కుంచె..
కళ్ళు వేగంగా కదులుతూ
చేయికి పని చెబుతున్నాయి
తన బొమ్మను తనే చిత్రిస్తూ
ఓ రకమైన ఆత్రుత పడ్డాడు
కనుబొమలు తీర్చి
పలు వరుసను ఏమార్చి
గోడకు చేరగిలబడి
రంగుల డబ్బాలు కాలికి దూరం జరిపి
ఆశ్చర్యాన్ని కలిగించేలా
తనను తాను గీసుకున్నాడు
పూర్తయిన చిత్రాన్ని చూసాడు
అంత బొమ్మలోనూ
ఒక్కటే కనిపిస్తోంది
చేతిలోని కుంచె
ఆ కుంచె
ఖళాఖండాలను సృష్టిస్తుంది
కన్నీటిని ఆపేస్తుంది
ఎడారిని మాయం చేస్తుంది
అది తన విద్య
తన సొత్తు
ఆ కుంచె అతనిది
అతనిదే..
