చిత్రంగా
చిత్రంగా
స్వార్థచింతనా శిఖరం..పెరుగుతోంది చిత్రంగా..!
మానవత్వ మేమూలో..నలుగుతోంది చిత్రంగా..!
రోగమేదొ ఉందంటే..మందన్నది అవసరమే..
ప్రపంచాన్ని పురుగుమందు..ఏలుతోంది చిత్రంగా..!
పెళ్ళితంతు కేమున్నది..సుఖజీవన మెక్కడుంది..
మాంగల్యం మాటు మనసు..నవ్వుతోంది చిత్రంగా..!
పెంపకాన్ని ప్రశ్నించే..పిల్లలెంత మేధావులు..
విర్రవీగు విజ్ఞానం..అడుగుతోంది చిత్రంగా..!
నీడకాచు గొడుగిప్పుడు..మనసేనని తెలిసేనా..
రెప్పచాటు కంటిచుక్క..మరుగుతోంది చిత్రంగా..!

