చిరునవ్వులనెలవంక
చిరునవ్వులనెలవంక
చిరునవ్వుల నెలవంకను..అరువు తెచ్చుకోలేవు..!
మనసు కాస్త విసిరేయక..ముద్దు అందుకోలేవు..!
ఏ బంగరు కిరీటాలు..ఎందాకా నీతోటి..
పొగడ్తలకు లోబడితే..వెలుగు నంచుకోలేవు..!
వేదాంతపు కోవెలేది..అసలు లేదు గమనించు..
నిన్ను-నీవు పట్టకుండ..అంతు తెలుసుకోలేవు..!
మేలుచేయు గుణముకన్న..బంగారం ఏదోయి..
గుణదోషా లెంచుతుంటె..గుట్టు పట్టుకోలేవు..!
నిదురముంచు కొచ్చినపుడు..అంతకన్న మిఠాయా..
ఎఱుకలోన ఉండకుండ..ఏమి నేర్చుకోలేవు..!

