STORYMIRROR

VENKATALAKSHMI N

Action Classics Others

4  

VENKATALAKSHMI N

Action Classics Others

చిరునవ్వు

చిరునవ్వు

1 min
251

దారం తెగిన గాలిపటం లా

జారిపోతున్న నా జీవితానికి

చేయూతనే ఆధారం నువ్వు..


ఎడారి మనసున మోడువారిన ఆశలకు

"చిరునవ్వు"జల్లులు కురిపించిన మేఘం నువ్వు


స్వరూపమంటూ ఎరుగని నా కలలకు

సప్తవర్ణ శోభితాలను అద్దిన హరివిల్లువు నీవు


గండి పడిన గుండె కు ఓదార్పు మాటలతో

వెన్నెల నద్దిన నిండు పౌర్ణమి వి నీవు


నిశీధిలా మదిని అలుముకున్న తెరలను

తొలగించి వేకువ పూయించిన తొలికిరణం నీవు


నిరాశల బరువును మోయలేని హృదయానికి ఆశల చివుళ్ళతో తేలికపరిచిన ఓదార్పువు నీవు


మది సంద్రంలో దాగిన బడబాగ్నులను

శాంతపరచిన చల్లని స్నేహం హస్తం నీవు


అందుకేనేమో... అనుక్షణం నీనామ మంత్రోచ్ఛారణ తో పదేపదే పెదవి కొమ్మ పై

"చిరునవ్వు"ల పూలు పూస్తున్నాయి


చిరునవ్వు ల వరమిచ్చిన

నా సిరిసిరి మువ్వా ...

భారమైన మనసుకు సాంత్వన నిచ్చు

నేనున్నానన్న నీ తీయని మాట చాలు

జన్మ జన్మల కు తీరని

ఋణం గా నిలచిపోనా



Rate this content
Log in

Similar telugu poem from Action