చిరునవ్వు సాక్షి గా
చిరునవ్వు సాక్షి గా
నీ పెదవుల అరుణిమలా..బ్రతకాలని ఉన్నది..!
నీ నవ్వుల లోయలలో..తిరగాలని ఉన్నది..!
ప్రేమలోతు చూపగలుగు..అక్షరాలు ఏవో..
నీ మౌనపు వెన్నెలగా..కురవాలని ఉన్నది..!
పెదవివిప్పి పాడలేని..పాటకదా స్నేహం..
నీ చూపుకు నవరాగం..కట్టాలని ఉన్నది..!
కట్టుకున్న ఇసకగూళ్ళు..చెరిపినపుడు ఆటే..
కన్నకలల కథలిప్పుడు..తుడపాలని ఉన్నది..!
తడబడే ఈ మాటల..తడికలేల ఇంకా..
గుండెచాటు గాయంతో..నవ్వాలని ఉన్నది..!
వేషమేదొ వేయలేని..తనముకదా బాల్యం..
ఎప్పటికీ చిగురాకుగ..ఉండాలని ఉన్నది.

