చినుకు చినుకు భావం
చినుకు చినుకు భావం
నీకోసం చూస్తుంటే..పొద్దులెన్ని గడిచాయో..!?
నీవు రాక..ప్రతిరాతిరి..ముద్దులెన్ని అలిగాయో..!?
ఈ తోటన ప్రతిమొక్కకు..నీ తలపులె లే చివురులు..
సమయమెంత భారమాయె..వలపులెన్ని పెరిగాయో..!?
విసుగులేని విరహానికి..వినోదమే..అనుక్షణం..
ఓర్చలేని తాపంతో..మధువులెన్ని మరిగాయో..!?
కనురెప్పల అంచులలో..చినుకు చినుకు భావనేమొ..
వేసవింటి ఊయలలో..సొగసులెన్ని ఇగిరాయో..!?
మట్టిపూల మనోరథం..నెరవేరే..మార్గమేదొ..
కానరాని వసంతాన..మరపులెన్ని దాగాయో..!?
మనసు..మోసగించు పనేముంది ఎపుడైనా..
తాళలేని మోహాలకు..హద్దులెన్ని మిగిలాయో..!

