STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

చింతన...

చింతన...

1 min
310

చింతించక తప్పదులే


నువ్వు చింతించక తప్పదు

నా కనుల నీరు కార్పించావు

నా కనులలో నా హృదయాన్ని చూడలేకపోయావు

నన్ను నిరాశలో నెట్టివేశావు

త్వరలోనే తెలుసుకుంటావు..ఎందుకో


నేను సుదూర తీరాలకు వెళ్ళినపుడు

చింతిస్తావు......

నా చిరునవ్వు. మిస్ అయినందుకు

నా కిల కిల నవ్వులు వినుపడక

నా హృదయం కనపడక

చింతిస్తావు..చాలా కాలమేమీ పట్టదులే !

నాకేమీ నచ్చదులే నువ్వు చింతించడము

నాకిష్టం లేదు కూడా....


నా హృదయరాణివి నువ్వే నన్నావు

నా వునికే లేదు నువ్వు లేనిదేనన్నావు

మరు దినం ప్రక్కన పెట్టేశావు....

ఎందుకో నీ ప్రేమ తరిగిపోయింది

ఈ దోబూజులాట ప్రేమ నాకు చేతగాదు

నేను అమాయికను

నైర్మాలిన్యమే నేను


చింతిస్తావు

నేనీనాడు లేకపోతినేయని


చింతిస్తావు

నాచిత్రాన్ని తడిమి తడిమి చూసి


చింతిస్తావు

నన్ను స్పృశించలేకపోతినేయని


చింతిస్తావు

నా హృదయపు తలుపులు తెరువలేక పోయానేయని


చింతలోనే నీకు సుఖముందేమో

చింతలోనే నీకు హాయి ఉందేమో

అలానే బ్రతుకు

అంతం వరకు

     ... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance