చిలకమ్మా
చిలకమ్మా
వెన్నెలింటి పరదాలకు..సిగ్గులెన్ని..రా చిలుకా..?!
ఈ'క్షణాల' మౌనాలకు సొగసులెన్ని..రా చిలుకా..?!
పరిమళాల పూలదారి నా ఎదుటే పరచినావు..!
తలపుమాటు దారాలకు నిగ్గులెన్ని..రా చిలుకా..?!
నా ఒంటరి తనమంతా ఏకాంతపు వనమాయెను..!
నీ చూపుల వేదాలకు వెలుగులెన్ని..రా చిలుకా..?!
నా ఊహల కనురెప్పల పాటంతా నీ ఊసే..!
దొంగాటల సరసాలకు ముగ్గులెన్ని..రా చిలుకా..?!
మోహాలకు అతీతమౌ మల్లెతీగ స్నేహమేగ..!
ప్రేమతోట పుష్పాలకు రంగులెన్ని..రా చిలుకా..?!

